కేసు వెనక్కి తీసుకోవాలని కోరుతున్న వైకల్యంతో బాధపడుతున్న వలసదారుడు

- January 19, 2022 , by Maagulf
కేసు వెనక్కి తీసుకోవాలని కోరుతున్న వైకల్యంతో బాధపడుతున్న వలసదారుడు

బహ్రెయిన్: భారత వలసదారుడు సుధాకర్ రాధాకృష్ణన్, వైకల్యం కారణంగా కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా యజమానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 2017లో సుధాకర్ బహ్రెయిన్ వచ్చారు 450 బహ్రెయినీ దినార్ల వేతనం కలిగిన ఉద్యోగం ద్వారా. పదిహేడు నెలలపాటు పని చేసిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగిందనీ, తన సోదరుడు గాయపడ్డంతో వెళ్ళాల్సి వచ్చిందనీ, తిరిగి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయని సుధాకర్ చెప్పారు. తన వల్ల కంపెనీ నష్టపోయిందంటూ కంపెనీ యాజమాన్యం వేతనాన్ని చెల్లించడం మానేసిందని అన్నారాయన. నష్టాల నేపథ్యంలో 3,800 బహ్రెయినీ దినార్లు చెల్లించాల్సిందిగా యాజమాన్యం డిమాండ్ చేసిందన్నారు. కంపెనీ కేసు కూడా నమోదు చేసింది. దాంతో అతనిపై ట్రావెల్ బ్యాన్ విధించడం జరిగింది. హిద్ పోలీసుల ప్రమేయంతో వివాదం సద్దుమణిగి ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయడంతో, 21 జనవరి 2019న స్వదేశానికి వెళ్ళారు సుధాకర్. ఐదు నెలల తర్వాత వేరే యజమాని వద్ద పని దొరకడంతో మళ్ళీ బహ్రెయిన్ వచ్చారు. అనంతరం తీవ్రమైన వెన్ను సమస్య రావడంతో పని చేయడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. తిరిగి స్వదేశానికి వచ్చేద్దామనుకుంటే తన మీద ట్రావెల్ బ్యాన్ వున్నట్లు తెలిసి డీలాపడ్డారు సుధాకర్. కొత్త కేసు తన మీద బనాయించబడిందనీ, 13,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాల్సిందిగా ఆ కేసులో పేర్కొన్నారనీ, నడవలేని పరిస్థితుల్లో వున్న తానెలా ఆ మొత్తాన్ని చెల్లించగలనని ఆవేదన చెందుతూ, సాయం కోరుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com