బ్రిట‌న్ కీల‌క నిర్ణ‌యం

- January 20, 2022 , by Maagulf
బ్రిట‌న్ కీల‌క నిర్ణ‌యం

లండన్: బ్రిట‌న్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో బ్రిట‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.వ‌చ్చే వారం నుంచి క‌రోనా ఆంక్ష‌ల‌ను స‌డ‌లించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటోంది.ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి త‌గ్గుతున్న నేప‌థ్యంలో మాస్క్‌ను త‌ప్ప‌నిస‌రి నుంచి మిన‌హాయింపు ఇవ్వ‌బోతున్న‌ట్టు ఆ దేశ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ దిగువ స‌భ‌లో పేర్కొన్నారు.వ‌చ్చే వారం నుంచి మిన‌హాయింపులు ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలిపారు.బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ కేసులు పీక్స్ ద‌శ‌ను దాటింద‌ని, ఆఫీస్ ఆఫ్ నేష‌న‌ల్ స్టాటిస్టిక్స్ తెలియ‌జేసింది.  

వ‌చ్చే గురువారం నుంచి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌లు, మాస్క్‌లు ధ‌రించ‌డం, స‌భ‌లు స‌మావేశాల‌కు క‌రోనా వ్యాక్సినేష‌న్ దృవ‌ప‌త్రం త‌ప్ప‌నిస‌రి కాద‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని తెలిపారు.త‌మ‌కు బ్రిట‌న్ పౌరుల‌పై పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని, ర‌ద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్ర‌జ‌లు మాస్క్ ధ‌రిస్తార‌ని అన్నారు.  అయితే, మాస్క్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని ప్ర‌ధాని బోరిస్ జాన్సన్ అన్నారు.డిసెంబ‌ర్ 8 నుంచి ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తూ వ‌స్తున్నారు.రోజుకు 2 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌వ‌డంతో బ్రిట‌న్ ప్ర‌భుత్వం అప్ప‌ట్లో ఈ నిర్ణ‌యం తీసుకుంది.కాగా, కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో ఆంక్ష‌ల‌ను ఎత్తివేసేందుకు సిద్దం అవుతున్న‌ది బ్రిట‌న్‌ ప్రభుత్వం.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com