ఏపీలో కరోనా డేంజర్ బెల్స్..
- January 20, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌పై కరోనా మహమ్మారి దాడికి దిగుతోంది.గత రెండు రోజులుగా అమాంతం రోజువారి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. మరోసారి భారీగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.గత 24 గంటల్లో రాష్ట్రలో 47,420 శాంపిల్స్ పరీక్షించగా..12,615 మందికి పాజిటివ్‌గా తేలింది.మరో ఐదుగురు కోవిడ్ బాధితులు మృతి చెందారు.విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కరి చొప్పున కన్నుమూశారు.ఇక, గత 24 గంటల్లో 3,674 మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలున్నారు. ఇప్పటి వరకు ఏపీలో నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 3,20,12,102కు చేరగా.. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 21,40,056కు, రికవరీ కేసులు 20,71,658కి, కోవిడ్ మృతుల సంఖ్య 14,527కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 53,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. తాజా కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 2,338, విశాఖలో 2,117, గుంటూరులో 1,066, విజయనగరంలో 1,039, నెల్లూరులో 1,012 నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







