టీ20 వరల్డ్‌కప్ 2022 షెడ్యూల్...

- January 21, 2022 , by Maagulf
టీ20 వరల్డ్‌కప్ 2022 షెడ్యూల్...

టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 16-నవంబర్ 13 వరకు మెగా టోర్నమెంట్ జరగనుంది. నవంబర్ 9న తొలి సెమీఫైనల్ ఉండగా.. నవంబర్ 10న రెండో సెమీఫైనల్, నవంబర్ 13న ఫైనల్ జరుగుతాయి.

మరోవైపు సూపర్-12 స్టేజీ.. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్‌తో పాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అక్టోబర్ 23న టీమిండియా దాయాది జట్టు పాకిస్థాన్‌తో తొలి పోరులో తలబడనుంది. అటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా అక్టోబర్ 28న మ్యాచ్ జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com