హైదరాబాద్ లో నకిలీ ఆర్టీపీసీఆర్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు కలకలం
- January 21, 2022
హైదరాబాద్: హైదరాబాద్లో నకిలీ ఆర్టీపీసీఆర్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు కలకలం రేగింది. పాత బస్తీలో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నకిలీ సర్టిఫికెట్లు పరఫరా చేస్తోంది.
అటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం ఈ ముఠా నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను కూడా విక్రయిస్తున్నారు. నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
50 ఫేక్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లు, 10 ఫేక్ ఆర్టీపీసీఆర్ రిపోర్టులు, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సౌత్ జోన్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. ఆసీఫ్ నగర్ లో తారీఫ్ కు సొంత ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు ట్రావెల్ చేయడానికి వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో వ్యాక్సిన్ సర్టిఫికెట్లకు డిమాండ్ ఎక్కువంగా ఉంది.
ఈ నేపథ్యంలో ట్రావెల్ ఏజెంట్ దగ్గర నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వారితో టై అప్ చేసుకోని ముఠా ఫేక్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారని తెలిపారు. వీరి నుంచి మొత్తం 65 రిపోర్టులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న అందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్