యెమన్ జైలుపై సౌదీ ఎయిర్ స్ట్రైక్...
- January 22, 2022
యెమన్: యెమన్, సౌదీ అరేబియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు ఒకదానిపై మరొకటి వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. సౌదీ తాజాగా యెమన్లోని సాదా జైలుపై వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో వంద మందికి పైగా మృతి చెందారు. మరో 100 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
గాయపడిన వారిని చికిత్స కోసం యెమన్లోని ఇతర ప్రాంతాలకు తరలించారు. మృతుల్లో పలువురు చిన్నారులు, ఆఫ్రికా వలసదారులు కూడా ఉన్నారు. కోస్టల్ సిటీ హొడేయిదాలో మరో ఎయిర్ స్ట్రైక్ జరిగింది. యెమన్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయిన పరిస్థితి. స్థానిక జైలుపైనా దాడి జరిగినట్లు రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ ప్రతినిధులు చెప్పారు.
అబుధాబిలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై యెమన్ హౌతీ తిరుగుబాటుదారులు 2022, జనవరి 17న జరిపిన డ్రోన్ బాంబు దాడులతో పరిస్థితి హీటెక్కింది. ఈ బాంబ్ బ్లాస్ట్‌ల్లో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు పౌరులు మృతి చెందారు. దీనికి కౌంటర్ గా కొద్ది గంటల్లోనే సౌదీ సంకీర్ణ దళాలు.. హౌతీ తిరుబాటుదారుల ఆధీనంలోని యెమన్ రాజధాని సనాపై జనవరి 18న వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు. తాజాగా మరోసారి సౌదీ దాడులు జరిపింది. ఈసారి భారీగా ప్రాణనష్టం సంభవించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!