EDCIL లో ఉద్యోగాలు
- January 22, 2022ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (EDCIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఈ మినీరత్నసంస్థ పదో తరగతి విద్యార్హత మొదలు పీహెచ్డీ ఆధారంగా ఉన్న పలు పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- వీటిలో సీనియర్ కన్సల్టెంట్లు (ఫైనాన్స్) – 02, కన్సల్టెంట్లు (10), ఐటీ మేనేజర్ (01), ఐటీ ఎగ్జిక్యూటివ్ (01), ఆఫీస్ మేనేజర్ (01), ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ (03), ఆఫీస్ బాయ్స్ (02) పోస్టులను భర్తీ చేయనున్నారు.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ అడ్వాన్సడ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, ఎంఫిల్/ పీహెచ్డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నైపుణ్యాలు తప్పనిసరి.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 25000 నుంచి రూ. 75000 వరకు చెల్లిస్తారు.
- దరఖాస్తుల స్వీకరణకు 07-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి..
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..