గల్ఫ్ లో అతిపెద్ద చేపల మార్కెట్ ‘ఫిష్ ఐలాండ్‌’ ప్రారంభం

- January 25, 2022 , by Maagulf
గల్ఫ్ లో అతిపెద్ద చేపల మార్కెట్ ‘ఫిష్ ఐలాండ్‌’ ప్రారంభం

సౌదీ: గల్ఫ్ ప్రాంతంలోని అతిపెద్ద చేపల ద్వీపమైన ఫిష్ ఐలాండ్‌ను తూర్పు ప్రావిన్స్ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నయీఫ్ ఖతీఫ్‌లో ప్రారంభించారు. ఈ ప్రాంతంలో బిజినెస్ ను ప్రోత్సహించడంతోపాటు ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను అందించడం కోసం ఫిష్ ఐలాండ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. 6,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టులో భాగంగా రిటైల్ దుకాణాలు, హోల్‌సేల్ వ్యాపారులకు సైడ్ యార్డ్, ఇన్వెస్ట్‌మెంట్ సైట్‌లు, ఐస్ ఫ్యాక్టరీ, స్టోరేజ్ అండ్ కూలింగ్ ఛాంబర్లను ఏర్పాటు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com