మస్కట్‌లో 500,000 నకిలీ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ సీజ్
- January 25, 2022
ఒమన్: 500,000 నకిలీ ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ ను మస్కట్ - కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) సీజ్ చేసింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ, రాయల్ ఒమన్ పోలీస్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సంయుక్తంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయించే ప్రముఖ సంస్థపై దాడి చేశారు. అక్కడ నిల్వ చేసిన ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ల నకిలీ ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీఏ లోని ఒక అధికారి చెప్పారు. సీజ్ చేసిన వాటిల్లో ఎలక్ట్రికల్ పరికరాలు, వైర్లు, ఎలక్ట్రిక్ బల్బుల వంటివి ఉన్నాయన్నారు. ఈసందర్భంగా నకిలీ ఎలక్ట్రికల్ వస్తువులను తయారు చేస్తున్న స్కిల్డ్ లేబర్ ను అరెస్ట్ చేశారు. దాడులు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అథారిటీ స్పష్టం చేసింది. నకిలీ వస్తువులను అమ్మే వారి వివరాలను తెలియజేయాలని ప్రజలను సీపీఏ కోరింది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







