పెద్ద మొత్తంలో పొగాకు, లారికా పౌడర్ స్వాధీనం
- January 25, 2022
కువైట్: ఎయిర్ కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో నిషేధిత పొగాకు, లారికా పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల లారికా పౌడర్, రెండు టన్నుల నమిలే పొగాకును ఎయిర్ కార్గో విభాగానికి చెందిన కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. నిషిద్ధ వస్తువులు (పొగాకు, లారికా పౌడర్) ఎయిర్ పార్శిల్ ప్యాకెట్లలో తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ కార్గో డైరెక్టర్ ముత్లాక్ టర్కీ అల్-అంజీ తెలిపారు. ఇందులో ఒకటి గల్ఫ్ దేశం నుంచి, మరొకటి చైనా నుంచి ఎక్స్ ప్రెస్ మెయిల్ ద్వారా వచ్చాయన్నారు. ఎయిర్ కార్గో కస్టమ్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు కార్గోల తనిఖీ ప్రక్రియను చేపట్టినట్టు వివరించారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు