‘కొండా’ ట్రైలర్ విడుదల
- January 26, 2022వరంగల్: సెన్సేషన్ డైరెక్టర్ ఆర్జీవీ ఇటీవల రాజకీయాల్లోని చాలా మంది బయోపిక్స్ ని ఒక్కొక్కటిగా తెరకెక్కిస్తున్నారు. ఆర్జీవీ ఇటీవల తెలంగాణ నాయకుడు కొండా మురళి బయోపిక్ ని అనౌన్స్ చేశాడు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ సినిమా ఆసక్తిగా మారింది. గతంలో ఆర్జీవీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”నేను మాఫియా, ఫ్యాక్షనిజం, రౌడీయిజంపై సినిమాలు తీసాను కానీ తెలంగాణ నక్సలైట్, మావోయిస్టుల గురించి తీయలేదు. ఇప్పుడు కొండా మురళి బయోపిక్ తో అది కూడా పూర్తవుతుంది” అని తెలిపారు. కొండా మురళి, కొండా సురేఖల నేపథ్యంలోంచి తెలంగాణ రాజకీయాలని, సాయుధ పోరాటాలని ”కొండా” సినిమాలో తెరకెక్కించారు.
తాజాగా ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ‘కొండా’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కంటే ముందే ఈ సినిమాలో కథేంటో ఒక వీడియోతో చెప్పి ట్రైలర్ కంటే ముందే రిలీజ్ చేశారు. తాజాగా ‘కొండా’ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో కొండా మురళి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు? సురేఖతో ప్రేమ? సురేఖ కొండా మురళికి ఎలా సపోర్ట్ చేసింది? కొండా మురళి మీద జరిగిన హత్యాయత్నం, నక్సలైట్ల నేపథ్యం… ఇలాంటి అంశాలన్నీ చూపించినట్లు తెలుస్తుంది.
ట్రైలర్ లో ఆర్జీవీ మార్క్ కనపడింది. చివరగా నా పేరు కొండా మురళి అంటూ ఈ ట్రైలర్ ని ముగించాడు. త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. తెలంగాణ రాజకీయ నేపథ్యం, తెలంగాణ నక్సలైట్లు, మావోయిస్టుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండటంతో ఈ సినిమాపై తెలంగాణలో మరింత ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్‌లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్‌కు సర్వంసిద్ధం..
- పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి