హౌతీ టెర్రరిస్ట్ వీడియోలు షేర్ చేసిన వారిపై చర్యలు

- January 27, 2022 , by Maagulf
హౌతీ టెర్రరిస్ట్ వీడియోలు షేర్ చేసిన వారిపై చర్యలు

అబుధాబి: దేశంలోని కొన్ని ముఖ్యమైన స్థావరాలు, రక్షణ వ్యవస్థను తెలిపేలా ఉన్న కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రెసిడెంట్స్ ను ప్రాసిక్యూషన్ చేశారు. ఇలాంటి వీడియోలు హౌతీ టెర్రరిస్ట్ మిలీషియాకు అనుకూలంగా మారుతున్నాయని ప్రాసిక్యూషన్ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు కీలకమైన సైనిక స్థావరాలను ప్రమాదంలో పడేస్తాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రక్షణ వ్యవస్థను తెలిపే వీడియోలను షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యూఏఈ అటార్నీ జనరల్, సలహాదారు డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ హెచ్చరించారు. కీలక విషయాలపై ప్రభుత్వ సంస్థలు గోప్యత పాటిస్తాయని, సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసే ముందు రీ చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com