కిడ్నాప్ కేసులో ముగ్గురు ఆసియా జాతీయులకు జైలు శిక్ష
- January 27, 2022
బహ్రెయిన్: కిడ్నాప్ కేసులో ముగ్గురు ఆసియా జాతీయులకు జైలు శిక్ష విధించారు. ఓ వ్యక్తిని (ఆసియా జాతీయుడు) నిందితులు ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో కిడ్నాప్ చేశారు. సుమారు 700 బహ్రెయినీ దినార్ల సొమ్ము విషయమై తలెత్తిన వివాదంతో ఈ కిడ్నాప్ జరిగింది. బాధిత వ్యక్తిని తాము వున్న చోటుకు రమ్మని నిందితులు రమ్మని కోరగా, అందుకు బాధితుడు నిరాకరించాడు. దాంతో, అతన్ని బెదిరించి కారులో కూర్చోబెట్టి, దారుణంగా కొట్టారు. రెండు రోజులపాటు బాధితుడిపై నిందితులు దాడి చేశారు. రెండు రోజుల తర్వాత బాధితుడు వారి బారి నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో పోలీసులు అతన్ని రక్షించారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తన వద్ద డబ్బు తీసుకుని, తిరిగి చెల్లించని కారణంగానే అతన్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని విచారణలో ప్రధాన నిందితుడు అంగీకరించాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!