ముంబైలో భారీ బడ్జెట్ తో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

- January 27, 2022 , by Maagulf
ముంబైలో భారీ బడ్జెట్ తో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

ముంబై: ముంబై వాతావరణంలో మరింత కాలుష్యం చేరకుండా ఉండేందుకు BEST కమిటీ అద్భుతమైన కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. రూ.3వేల 600కోట్లు వెచ్చించి 12ఏళ్ల పాటు 900 ఎలక్ట్రిక్ బస్సులను లీజుకు తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.992కోట్లు విడుదల చేసేసింది కూడా.

ఈ బస్సులను విడతల వారీగా విడుదల చేయనున్నారు. తొలి విడతలో 225 డబుల్ డెక్కర్ బస్సులు, రెండో సారి మార్చి 2023 నాటికల్లా మరో 225బస్సులు.. మిగిలిన 450 బస్సులు జూన్ 2023వరకూ అందుబాటులోకి వస్తాయని BEST జనరల్ మేనేజర్ లోకేశ్ చంద్ర అంటున్నారు.ప్రస్తుతం ముంబైలో 48 రెగ్యూలర్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయట.

900 కొత్త ఏసీ డబుల్ డెక్కర్ బస్సులు రిలీజ్ అయితే వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. దశాబ్ద కాలం తర్వాత గుర్తుండిపోయే బస్సులుగా ఇవే నిలవనున్నాయి. వీటి వల్ల ఆఫీసులకు కరెక్ట్ టైంకు చేరుకోవడమే కాకుండా.. ఇరుకుగా ప్రయాణించాల్సిన అవసరం ఉండదు’ అని చెప్తుంది BEST కమిటీ.

ముందుగా 200 డబుల్ డెక్కర్ బస్సులు మాత్రమే సరిపోతాయని… క్రమంగా టెండర్ పపెంచుకుంటూ పోయారు. అవసరాలకు తగ్గట్లుగా బస్సులను అందజేయగలమో లేదోనని ఒకసారి చేసుకోవాలని పానెల్ మెంబర్ సునీల్ గణాచార్య అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com