PGCIL లో ఉద్యోగాలు..
- January 28, 2022
పీజీసీఐఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ ట్రెయినీ (AET) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 105 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 105 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు సంబంధించి గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 20 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్సైట్ https://www.powergrid.in/చూడొచ్చు.
మొత్తం పొస్టుల సంఖ్య : 105 పోస్టులు: అసిస్టెంట్ ఇంజనీర్ ట్రెయినీ ఖాళీల వివరాలు: కంప్యూటర్ సైన్స్: 37, ఎలక్ట్రికల్: 60, సివిల్: 4, ఎలక్ట్రానిక్స్: 4 ట్రెయినింగ్ పీరియడ్ : ఏడాది పే స్కేల్: ట్రెయినింగ్ పీరియడ్లో నెలకు రూ.40,000 జీతంగా చెల్లిస్తారు. ట్రెయినింగ్ పూర్తయిన తర్వాత రూ.50,000 నుంచి రూ.1,60,000 జీతంగా చెల్లిస్తారు. అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ 2021 కూడా ఉండాలి.
వయోపరిమితి: డిసెంబర్ 31, 2021 నాటికి అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు. ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము: ఓబీసీ, ఇతర అభ్యర్ధులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 20, 2022 పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.powergrid.in/
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!