అవినీతి న్యాయమూర్తులకు కఠినమైన జరీమానాలు: ప్రాసిక్యూషన్

- January 29, 2022 , by Maagulf
అవినీతి న్యాయమూర్తులకు కఠినమైన జరీమానాలు: ప్రాసిక్యూషన్

కువైట్: న్యాయమూర్తుల అవినీతికి సంబంధించి కోర్టు ఆఫ్ అప్పీల్ ఫిబ్రవరి 9న విచారణ జరపనుంది. జడ్జిలు, లాయర్లు, వ్యాపరవేత్తలు ఓ కేసులో నిందితులుగా తేలారు. వీరికి కింది న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఖరీదైన వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో కఠినమైన జరీమానాలు విధించాల్సిందిగా ప్రాసిక్యూషన్ న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. అభియోగాలు మోపబడిన ఆరుగురు న్యాయమూర్తుల్లో నలుగురు సరెండర్ అయిపోయారు. తమను విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే, కోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. దోషులకు 4 నుంచి 15 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించింది. కాగా, జరీమానాలు 9000 నుంచి 400,000 దినార్ల వరకు విధించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com