హైదరాబాద్‌లో డ్రిల్మెక్ గ్లోబల్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్
- January 31, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి సంస్థ వచ్చింది. ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజ కంపెనీ డ్రిల్మెక్ ఎస్పిఏ హైదరాబాద్‌లో 200 మిలియన్ US డాలర్ల (రూ.1500 కోట్ల )భారీ పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఏడాదికి 200 మిలియన్ US డాలర్ల టర్నోవర్ ఉన్న డ్రిల్మెక్, మేఘా ఇంజినీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) గ్రూప్‌కు అనుబంధ సంస్థ.
తెలంగాణలో ఆయిల్ రిగ్‌లు మరియు అనుబంధ పరికరాల తయారీ కోసం డ్రిల్మెక్ ఇంటర్నేషనల్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు & వాణిజ్య శాఖతో డ్రిల్మెక్ అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. Drillmec SpA, CEO, సిమోన్ ట్రెవిసాని, తెలంగాణ పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్లు ఎంఓయూపై సంతకాలు చేశారు.
చమురు, ఇందనం వెలికితీసే హైటెక్ రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (Drillmec SpA) సొంతం చేసుకుంది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌లో చమురు వెలికితీసేందుకు అవసరమైన అత్యాధునిక డ్రిల్లింగ్ రిగ్గుల తయారీతోపాటు, వర్క్ఓవర్ రిగ్‌ల రూపకల్పన, తయారీ, సరఫరాలో గ్లోబల్ లీడర్‌గా ఉంది. డ్రిల్లింగ్ రిగ్గులకు అవసరమైన విస్తృత శ్రేణి విడిభాగాల తయారీలో కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టతలను సొంతం చేసుకుంది.
డ్రిల్మెక్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 600 డ్రిల్లింగ్ రిగ్‌లను పంపిణీ చేసింది. రిగ్గుల రూపకల్పనలో అనేక వినూత్న డిజైన్లను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా పేటెంట్లను పొందింది. ఇటలీలోని పోడెన్‌జానో పిసి కేంద్రంగా రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్న డ్రిల్మెక్ కంపెనీని 2020లో MEIL గ్రూప్ కొనుగోలు చేసింది. డ్రిల్మెక్ SpA, తెలంగాణ పరిశ్రమలు & వాణిజ్య శాఖ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రిగ్గు పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV)ని ప్రారంభించనుంది.
ఈ సందర్బంగా డ్రిల్మెక్ ఎస్.పి.ఎ. సీఇఒ సిమోన్ ట్రెవిసాని మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవమని, ఈ డ్రిల్లింగ్ రిగ్గుల తయారీ యూనిట్ దేశంలో ఇంధన భద్రతకు భరోసా ఇస్తుందని అన్నారు. అంతేకాకుండ, భారత దేశంలో పెట్టుబడులకు , పరిశ్రమల స్థాపన కు స్నేహపూర్వక మరియు అనుకూలం వాతావరణం కల్గిన తెలంగాణ లో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి 2500 మందికి ఉపాధి కల్పించడం డ్రిల్మెక్ ఎస్.పి.ఎ. కు గర్వకారణం అని తెలిపారు. భవిష్యత్తు లో డ్రిల్మెక్ హైడ్రోజన్ ఇంధన ప్రాజెక్ట్ ని భారత్ లోకి తీసుకొస్తాము అని తెలిపారు.
తెలంగాణ పరిశ్రమల శాఖా మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ.. డ్రిల్మెక్ కంపెనీ తెలంగాణ లో పెట్టుబడి పెట్టి, ఆయిల్ రిగ్గుల తయారి గ్లోబల్ హబ్ ఏర్పాటు ను అభినన్దిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం తరుపున అనవసరమైన వనరులను సమకూర్చడమ్ తో పాటూ ఔత్స్కమైన ప్రొత్సాహకాలను అందిస్తాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా ఇతర డ్రిల్లింగ్ వ్యవస్థలో ఉండే కంపెని లను కూడా తెలంగాణ కు తీసుకురావలని డ్రిల్మెక్ సి ఈ ఒ సిమొని ట్రెవిసాని ని కోరారు.
డ్రిల్మెక్ ఇంటర్నేషనల్ సి ఇ ఒ ఉమా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఎంఓయూ చేసుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇది హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయే మ్యానుఫ్యాక్చరింగ్ గ్లోబల్ హబ్ కి తొలిమెట్టు. ప్రపంచ వ్యాప్తంగా డ్రిల్మెక్ కి 1 బిలియన్ డాలర్ల విలువ గల ఆర్డర్స్ వచ్చాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా నాణ్యత గల మానవ వనరులను తీర్చిదిద్దుతాము అని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!