ఏపీ కరోనా అప్డేట్

- January 31, 2022 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది.కొత్త కేసులు భారీగా తగ్గాయి.రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5వేల 879 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మరో 9 మంది కరోనాతో చనిపోయారు.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11వేల 384 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.ఆదివారం 10వేల 310 కోవిడ్ కేసులు నమోదవగా..సోమవారం ఆ సంఖ్య భారీ తగ్గడం ఊరటనిచ్చే అంశం.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,10,517 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 25వేల 284మందికి కరోనా టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com