జాతీయ జెండా చట్టానికి సవరణల్ని ఆమోదించిన షౌరా కౌన్సిల్
- February 02, 2022
రియాద్: సౌదీ అరేబియా షౌరా కౌన్సిల్, జాతీయ పతాకం, చిహ్నం అలాగే జాతీయ గీతానికి సంబంధించి చట్టానికి సవరణలు చేయడం జరిగింది. ఆకుపచ్చ జెండాపై కత్తి అలాగే ఇస్లామ్ సూక్తుల్ని మరింత స్పష్టంగా తెలిసేలా చూపించనున్నారు. జాతీయ జెండా, జాతీయ గీతం తాలూకు ఆవశ్యకతను మరింత బాగా తెలుసుకునేలా, నిర్లక్ష్యానికి వీలు లేకుండా పలు కీలక చర్యలు తీసుకున్నారు. షౌరా సభ్యుడు సాద్ అల్ ఒతైబి ఈ సవరణను ప్రతిపాదించారు. ఈ సవరణపై షౌరా కౌన్సిల్లో చర్చ, ఓటింగ్ జరిగాయి. సవరణల ద్వారా చట్టాల్ని ఉల్లంఘించేవారికి జరీమానాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. యాభయ్యేళ్ళుగా వున్న చట్టానికి తాజాగా సవరణ చేశారు. జాతీయ చిహ్నాన్ని వినియోగించడంపైనా స్పష్టమైన నిబంధనల్ని పేర్కొన్నారు. తగిన అనుమతులు లేకుండా చిహ్నాన్ని వినియోగించడానికి వీల్లేదు. ఉల్లంఘనలకు విధించే జరీమానాలపై స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కమర్షియల్ వినియోగానికి వీల్లేకుండా జాతీయ చిహ్నానికి ప్రత్యేకతల్ని అద్దారు ఈ సవరణల ద్వారా. ఆకుపచ్చని పతాకంపై తెల్లటి అక్షరాలతో అల్లాని మించిన దైవం లేదు.. అల్లా దూత మొహమ్మద్.. అని జాతీయ పతాకంపై పేర్కొంటారు. జాతీయ జెండా డిజైన్ మార్చి 15, 1973న ఖరారు చేయబడింది. కింగ్ ఫైజల్హయాంలో సౌదీ ఫ్లాగ్ చట్టం రూపొందింది. రెక్టాంగిల్ షేప్‌లో ఈ జెండా వుంటుంది. జాతీయ చిహ్నం 1950లో ఖరారు చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి