45 మంది బిచ్చగాళ్ళ అరెస్ట్

- February 03, 2022 , by Maagulf
45 మంది బిచ్చగాళ్ళ అరెస్ట్

యూఏఈ: అజ్మన్ పోలీస్, 45 మంది బిచ్చగాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. వారం రోజులపాటు నిర్వహించిన తనిఖీల్లో బిచ్చగాళ్ళను గుర్తించి అరెస్టు చేశారు అధికారులు. అరెస్టయినవారిలో 28 మంది పురుషులు, 16 మంది మహిళలు ఓ చిన్నారి వున్నట్లు తెలుస్తోంది. ఎమిరేట్‌లోని పలు ప్రాంతాల నుంచి వీరిని అరెస్టు చేశారు. అరెస్టయినవాళ్ళలో పేదవాళ్ళలా కొందరు నటిస్తూ, మరికొందరు వస్తువుల్ని విక్రయిస్తూ.. సాధారణ పౌరులు, ప్రజలకు ఇబ్బందుల్ని కలగజేస్తున్నారని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com