కువైట్ లో 40 శాతం తగ్గిన హోటల్ బిజినెస్

- February 06, 2022 , by Maagulf
కువైట్ లో 40 శాతం తగ్గిన హోటల్ బిజినెస్

కువైట్: కొవిడ్-19 కారణంగా కువైట్ లో హోటల్ ఇండస్ట్రీ కుదేలైంది. హోటల్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నదని కువైట్ ఫెడరేషన్ ఆఫ్ రెస్టారెంట్స్, కేఫ్‌లు, క్యాటరింగ్ ఛైర్‌పర్సన్ ఫహద్ అల్-అర్బాష్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఇటీవల హోటళ్ల వ్యాపారం 40 శాతం పడిపోయిందని,  చాలా హోటల్స్ ‘డైన్-ఇన్’ మీల్స్ మాత్రమే అందిస్తున్నాయని ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను, డైన్-ఇన్ కస్టమర్ల సంఖ్యను తగ్గించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న మరీ దారుణంగా తయారైందని అర్బాష్ అన్నారు. అయితే, డెలివరీ సేవలను అందించే వారిపై ఎలాంటి ప్రభావం పడలేదని, కేవలం 'డైన్-ఇన్' మీల్స్ అందించే వారి మార్కెట్ మాత్రమే దెబ్బతిన్నదన్నారు. ఇటీవల కాలంలో వంట నూనె ధర 40 శాతం, ఇతర పదార్థాల ధరలు 20 నుండి 100 శాతం పెరిగాయని ఆయన వివరించారు. ఉదాహరణకు వెన్న ధర 100 శాతం పెరిగిందన్నారు. ఇది కూడా హోటళ్ల లాభాలు తగ్గడానికి దారితీసిందని ఆయన చెప్పారు. హోటల్స్ ధరలను పెంచాలనుకుంటే వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com