ఎక్స్ పో 2020 దుబాయ్.. మరోసారి తగ్గిన టిక్కెట్ ధరలు
- February 09, 2022
యూఏఈ: 'వరల్డ్స్ గ్రేటెస్ట్ షో' ఎక్స్ పో 2020కి ముగియడానికి ఇంకా ఎనిమిది వారాల కంటే తక్కువ సమయం ఉండటంతో టిక్కెట్ ధరలను మరోసారి తగ్గించారు. ఎక్స్ పో 2020 కోసం సింగిల్ ఎంట్రీ వారం పాస్ ధరను Dh45కి తగ్గించారు. 31, 2022 వరకు సింగిల్ ఎంట్రీకి సంబంధించి ఒక రోజు పాస్‌పై 50 శాతం తగ్గింపు ఇచ్చారు. 18- 59 సంవత్సరాల మధ్య వయస్సు గల సందర్శకులు ఈ పాస్‌ను పొందవచ్చు. 45 దిర్హామ్ టిక్కెట్ గతంలో సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దాన్ని వారం వీకెండ్ లకు పొడిగించారు. అలాగే టికెట్ కొన్నావారు 10 స్మార్ట్ క్యూ బుకింగ్‌లకు అర్హత సాధిస్తారు. Dh195 ధరతో పాస్ తో మార్చి 31, 2022 వరకు అపరిమితంగా ఎక్స్ పో 2020 దుబాయ్‌ని సందర్శించవచ్చు. ఇంతకుముందు దీని ధర Dh 495. అక్టోబర్ 1, 2021న ప్రారంభమైనప్పటి నుండి ఫిబ్రవరి 1 నాటికి 11 మిలియన్లకు పైగా సందర్శకులు ఎక్స్ పో 2020 దుబాయ్ ని సందర్శించారు.
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం