ఎక్స్ పో 2020 దుబాయ్.. మరోసారి తగ్గిన టిక్కెట్ ధరలు

- February 09, 2022 , by Maagulf
ఎక్స్ పో 2020 దుబాయ్.. మరోసారి తగ్గిన టిక్కెట్ ధరలు

యూఏఈ: 'వరల్డ్స్ గ్రేటెస్ట్ షో' ఎక్స్ పో 2020కి ముగియడానికి ఇంకా ఎనిమిది వారాల కంటే తక్కువ సమయం ఉండటంతో టిక్కెట్ ధరలను మరోసారి తగ్గించారు. ఎక్స్ పో 2020 కోసం సింగిల్ ఎంట్రీ వారం పాస్ ధరను Dh45కి తగ్గించారు. 31, 2022 వరకు సింగిల్ ఎంట్రీకి సంబంధించి ఒక రోజు పాస్‌పై 50 శాతం తగ్గింపు ఇచ్చారు. 18- 59 సంవత్సరాల మధ్య వయస్సు గల సందర్శకులు ఈ పాస్‌ను పొందవచ్చు. 45 దిర్హామ్ టిక్కెట్ గతంలో సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దాన్ని వారం వీకెండ్ లకు పొడిగించారు. అలాగే టికెట్ కొన్నావారు 10 స్మార్ట్ క్యూ బుకింగ్‌లకు అర్హత సాధిస్తారు. Dh195 ధరతో పాస్ తో మార్చి 31, 2022 వరకు అపరిమితంగా ఎక్స్ పో 2020 దుబాయ్‌ని సందర్శించవచ్చు. ఇంతకుముందు దీని ధర Dh 495. అక్టోబర్ 1, 2021న ప్రారంభమైనప్పటి నుండి ఫిబ్రవరి 1 నాటికి  11 మిలియన్లకు పైగా సందర్శకులు ఎక్స్ పో 2020 దుబాయ్ ని సందర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com