వర్కర్ వీసా అప్రూవల్: ఇకపై నిమిషాల వ్యవధిలోనే.!

- February 09, 2022 , by Maagulf
వర్కర్ వీసా అప్రూవల్: ఇకపై నిమిషాల వ్యవధిలోనే.!

దోహా: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఫాస్ట్ ట్రాక్ ఎలక్ట్రానిక్ సర్వీస్ విధానం ద్వారా లేబర్ మార్కెట్ అవసరాల్ని తీర్చనుంది. వీసా అప్రూవల్ ఇకపై నిమిషాల వ్యవధిలోనే జరగనుంది. విదేశాల నుంచి ఖతార్ వీసా పొందేందుకోసం ఈ ఎలక్ట్రానిక్ సేవను అందుబాటులోకి తెస్తున్నారు. లేబర్ చట్టానికి అనుగుణంగా మాత్రమే ఆయా కంపెనీలు ఈ సౌకర్యాన్ని పొందే వీలుంది. కొత్త అలాగే ఇప్పటికే వున్న సంస్థలు తమ కార్యకలాపాల్ని మరింత పెంచుకునేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడనుంది. కొత్ లేబర్ మార్కెట్ అనుమతుల కోసం స్మార్ట్ కార్డ్ అవసరం. సంస్థ ఐడెంటిటీని వెరిఫై చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. నేషనల్ అథెంటికేషన్ సిస్టమ్‌లోకి యాక్సెస్ పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాంటాక్ట్ సమాచారం సహా పలు వివరాల్ని పొందుపర్చాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com