COVID-19 వ్యాక్సిన్ పుకార్లపై స్పందించిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ
- February 11, 2022
సౌదీ: కోవిడ్-19 వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లు, అసత్య ప్రచారాన్ని ప్రివెంటివ్ హెల్త్ డిప్యూటీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్లా అసిరి ఖండించారు. ఈ వ్యాక్సిన్ మానవ జాతిని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్న ప్రచారం నిరాధారమని, ఈ వ్యాక్సిన్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతుందని ఆయన అన్నారు. కరోనావైరస్ వ్యాక్సిన్లు వంధ్యత్వానికి కారణమవుతాయని, సంతానోత్పత్తిని దెబ్బతీస్తాయనే వాదనలను కొట్టిపారేశారు. ఇప్పటికే డజన్ల కొద్దీ అధ్యయనాలు ఆ వాదనలు తప్పు అని చూపించాయని గుర్తు చేశారు. కరోనావైరస్ వ్యాక్సిన్‌కు అధికారులు అత్యవసర అనుమతి ఇవ్వలేదనే వాదనకు సంబంధించి.. జాతీయ టీకా డ్రైవ్ గురించి డాక్టర్ అసిరి ప్రస్తావించారు. ఆగస్టు 2021 నాటికి వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపిందని ఆయన గుర్తు చేశారు. అలాగే వ్యాక్సిన్లు జన్యు పరివర్తనకు కారణమవుతాయి అనే వాదన నిరాధారమైనదని డాక్టర్ అసిరి పేర్కొన్నారు. మయోకార్డిటిస్‌తో అథ్లెట్లు, కౌమారదశలో ఉన్నవారిని వ్యాక్సిన్ చంపేస్తుందనే వాదన కూడా అబద్ధమని నిరూపించబడిందని డాక్టర్ అసిరి చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!