రిటెయిల్ షాప్ బిల్ బోర్డులో ఇరుక్కుపోయిన వ్యక్తిని రక్షించిన అధికారులు

- February 11, 2022 , by Maagulf
రిటెయిల్ షాప్ బిల్ బోర్డులో ఇరుక్కుపోయిన వ్యక్తిని రక్షించిన అధికారులు

దుబాయ్: నైఫ్ పోలీస్ స్టేషన్, జనరల్ డిపార్టుమెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ రెస్క్యూ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ సంయుక్తంగా ఓ ఆఫ్రికా జాతీయుడ్ని రక్షించడం జరిగింది. బాధితుడు ఓ రిటెయిల్ స్టోర్‌లోని బిల్ బోర్డులో ప్రమాదవశాత్తూ ఇరుక్కుపోయాడు. తన ఫ్లాట్ మేట్స్‌తో వివాదం కారణంగా బాధిత వ్యక్తి, ఫస్ట్ ఫ్లోర్‌లోని బాత్రూమ్ విండో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బిల్ బోర్డులో పడిపోయాడు. స్టోర్ యజమాని విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో, సకాలంలో అక్కడికి చేరుకున్న రక్షణ సిబ్బంది బాధితుడ్ని బయటకు తీశారు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్య చికిత్స అందించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com