ఎం వ్యాలెట్ యాప్‌ను ప్రారంభించిన మంత్రులు..

- March 30, 2016 , by Maagulf
ఎం వ్యాలెట్ యాప్‌ను ప్రారంభించిన మంత్రులు..

సచివాలయంలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ఎం వ్యాలెట్ యాప్‌ను ప్రారంభించారు. మొబైల్‌లో వాహన పత్రాలు భద్రపరిచే ఎం వ్యాలెట్‌ను రవాణా శాఖ రూపొందించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాంకేతికత కొత్త పుంతలు తొక్కే వేళ.. ప్రజలకు అసౌకర్యాన్ని తగ్గించాలన్నారు. హైదరాబాద్‌లో నేరాలు 14 శాతం తగ్గడానికి సాంకేతికత దోహదం చేస్తుందన్నారు. గతంలో ఐటీ విభాగం క్రియాశీలంగా పని చేసే పరిస్థితి లేకుండే అన్నారు. సాంకేతిక వినియోగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com