ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు మోదీ పుష్ప నివాళి
- March 30, 2016
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుష్ప నివాళి అర్పించారు. భారత్, యురోపియన్ యూనియన్ మధ్య జరగనున్న శిఖరాగ్ర సదస్సులో పాల్గోనేందుకు మోదీ బ్రస్సెల్స్ వెళ్లారు. మాల్బీక్ మెట్రో స్టేషన్ దగ్గర మోదీ పుష్పగుచ్ఛం ఉంచారు. దాడి జరిగిన రోజున అక్కడ సుసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఆ పేలుడులో ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేశన్ మృతిచెందాడు. బ్రస్సెల్స్లో వారం రోజుల క్రితం జరిగిన పేలుళ్లలో సుమారు 32 మంది మృతిచెందారు. మాల్బీక్ స్టేషన్ దగ్గర జరిగిన పేలుడులోనే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బెల్జియం, యురోపియన్ యూనియన్ నేతలతో మోదీ భేటీ అయ్యారు.
ఎగ్మోంట్ ప్యాలెస్లో ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









