శాకుంతలం లుక్ కు ముహూర్తం ఫిక్స్

- February 20, 2022 , by Maagulf
శాకుంతలం లుక్ కు ముహూర్తం ఫిక్స్

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ పౌరాణిక లవ్ డ్రామా “శాకుంతలం” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మేకర్స్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే సామ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “శాకుంతలం” సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని ఫిబ్రవరి 21న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించారు మేకర్స్. దీంతో మూవీ ఫస్ట్ లుక్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కాళిదాస్ రచించిన శకుంతల, దుష్యంతుడి ప్రేమ గాథలో తన స్వంత వెర్షన్‌ను తీసుకుని, సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా గుణశేఖర్ ‘శాకుంతలం’ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో పురు రాజవంశం రాజు దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఈ చిత్రంతో ప్రిన్స్ భరతుడిగా సినిమా రంగ ప్రవేశం చేయనుంది. మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల మరియు వర్షిణి సౌందరరాజన్ తదితరులు ఈ చిత్ర తారాగణంలో భాగం కానున్నారు. గుణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ మరియు దిల్ రాజు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com