ముగిసిన టాలీవుడ్ కీలక సమావేశం..

- February 20, 2022 , by Maagulf
ముగిసిన టాలీవుడ్ కీలక సమావేశం..

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ, సినిమా రిలీజుల సమస్యలపై ఇవాళ ఉదయం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో నిర్మాత జి ఆది శేషగిరిరావు అధ్యక్షన టాలీవుడ్ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 24 క్రాఫ్ట్స్ తరపున ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య.. ఇలా అనేక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి దాదాపు 240 మందిని ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఆహ్వానించారు.

కొద్ది సేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎస్ ఎస్ రాజమౌళి, మైత్రీ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి, ఛత్రపతి ప్రసాద్, అనిల్ సుంకర, ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, నటుడు రాజేంద్రప్రసాద్, కొరటాల శివ, మురళీమోహన్, చదలవాడ శ్రీనివాసరావు, సి.కల్యాణ్, నిరంజన్ రెడ్డి, సుదాకర్ రెడ్డి, ఎన్.వి.ప్రసాద్…తదితరులతో పాటు అన్ని క్రాఫ్ట్స్ కి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో డిజిటల్ చార్జెస్, దియేటర్ యాజమాన్యం సమస్యలు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ విషయాలు, సినీ పరిశ్రమ సమస్యలు, సిని కార్మికుల వెల్ఫేర్ పై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఎలాంటి చర్చలు జరిగాయి? ఎలాంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారు? సినీ పరిశ్రమపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇంకా బయటకి తెలీదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com