అబుధాబి క్రౌన్ ప్రిన్స్ తో యూఏఈ ఉపాధ్యక్షుడు భేటీ

- February 22, 2022 , by Maagulf
అబుధాబి క్రౌన్ ప్రిన్స్ తో యూఏఈ ఉపాధ్యక్షుడు భేటీ

దుబాయ్: అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో  దుబాయ్ అల్ మర్మూమ్‌లో యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సమావేశమయ్యారు. ఈ మేరకు వారు తమ ట్విటర్ అకౌంట్లలో సమావేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఇద్దరు నాయకులు యూఏఈ అభివృద్ధి, సిటిజెన్స్/రెసిడెంట్స్ లకు అత్యున్నత నాణ్యమైన జీవితాన్ని అందించేందుకు చేపట్టాల్సిన “మెగా ప్రాజెక్ట్ లు, వ్యూహాత్మక ప్రణాళికల” గురించి చర్చించారని దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ట్వీట్ చేసింది. యూఏఈ అభివృద్ధికి తీసుకోవాల్సిన విభిన్న అంశాలపై వారు చర్చించారు. ‘ప్రాజెక్ట్స్ ఆఫ్ ది 50’లో భాగమైన అభివృద్ధి, ఆర్థిక కార్యక్రమాలు,  దేశం యొక్క తదుపరి దశ వృద్ధికి సంబంధించిన సన్నాహాలపై ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యంగా యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి, దేశ అభివృద్ధి ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచే మార్గాలను అన్వేషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒకచోట చేర్చడంలో, విభిన్న సంస్కృతులు, నాగరికతల గురించి తెలుసుకోవడానికి ఎక్స్ పో 2020 దుబాయ్ ఒక వేదికగా సాధించిన విజయంపై వారు చర్చించారు. మెగా గ్లోబల్ ఈవెంట్‌లను నిర్వహించే సామర్థ్యాన్ని ఈ ఈవెంట్ ప్రతిబింబిస్తుందని ఇద్దరు నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ నెల ప్రారంభంలో పలు సమస్యలపై చర్చించేందుకు ఇరువురు నేతలు అబుధాబిలో సమావేశమైన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com