క్రిప్టో హబ్‌గా బహ్రెయిన్
- February 24, 2022
బహ్రెయిన్: ప్రపంచంలోనే క్రిప్టోకరెన్సీ హబ్‌గా బహ్రెయిన్ మారుతోంది. యూఏఈ, గల్ఫ్ ప్రాంతాలు అతిపెద్ద క్రిప్టో మార్పిడికి నిలయంగా ఉన్నప్పటికీ అక్కడ వాటి వినియోగంపై నియంత్రణ ఉంది. Binanceకి దుబాయ్‌లో ఎక్స్ ఛేంజ్‌గా లైసెన్స్/బ్యాంకు అనుమతులు లేవు. అదే పొరుగున ఉన్న బహ్రెయిన్‌లో క్రిప్టో కరెన్సీ మార్పిడిని అధికారికంగా ఇటీవల ఆమోదించారు. ఇప్పటికే బహ్రెయిన్ లో క్రిప్టో కోసం బ్యాంకింగ్ నిబంధనలను రూపొందించారు. దీంతో బహ్రెయిన్ క్రిప్టో కంపెనీలకు ఆకర్షణీయమైన నిలయంగా మారింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ (CBB) కూడా క్రిప్టోకరెన్సీలను అధికారిక చెల్లింపు ఛానల్ గా అంగీకరిస్తుంది. అలాగే బ్యాంకులు, ఎక్స్ఛేంజీలతో కలిసి పని చేయడానికి బహ్రెయిన్ నిబంధనలు అనుమతిస్తున్నాయి. CoinMENA తోపాటు రెయిన్ అనేది CBB ద్వారా లైసెన్స్ పొందిన అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫారమ్స్. రెయిన్ 2021 ప్రథమార్ధంలో $1 బిలియన్ కంటే ఎక్కువ ట్రేడింగ్ వాల్యూమ్‌ను సాధించడం విశేషం.
తాజా వార్తలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్‌కతా ఫెస్టివల్ థీమ్..!!