భారత్ కరోనా అప్డేట్

- February 27, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో  కరోనా థర్డ్‌వేవ్‌ విజృంభణ తగ్గుముఖం పట్టింది.క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది.కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 10,273 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.మరో 243 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు.

ఇక, 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా మరో 20,439 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. పాజిటివిటీ రేటు 1.0 శాతానికి పడిపోయింది.. యాక్టివ్​కేసుల సంఖ్య 1,11,472గా ఉంది.ఇప్పటి వరకు మృతి చెందిన కోవిడ్‌ బాధితుల సంఖ్య 5,13,724కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 4,22,90,921కు పెరిగింది.మరోవైపు, వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.. శనివారం ఒకేరోజు 24,05,049 డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు పంపిణీ చేసిన కోవిడ్‌ టీకా డోసుల సంఖ్య 177,44,08,129కు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com