జాతీయ సెలవు దినాల్లో 70% తగ్గిన గార్బెజ్
- February 27, 2022
కువైట్: అన్ని గవర్నరేట్లలోని మునిసిపాలిటీ శాఖలు చేపట్టిన విస్తృతమైన క్లీనింగ్ క్యాంపెయిన్ లు ఫలితాన్నిచ్చాయి. ఈ జాతీయ సెలవు దినాల్లో 70% గార్బెజ్ తగ్గిందని మున్సిపల్ వర్గాలు తెలిపాయి. గల్ఫ్ స్ట్రీట్‌లో కువైట్ సిటిజన్స్/రెసిడెంట్స్ జాతీయ సెలవులను వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గతేడాదితో పోలిస్తే ఆయా వీధుల నుండి సేకరించిన గార్బెజ్ 70% వరకు తగ్గడం విశేషం. గల్ఫ్ స్ట్రీట్ థర్డ్ రింగ్ రోడ్ నుండి మెస్సిలా బ్రైడ్ వరకు ఉన్న పార్కింగ్ స్థలాలు, పచ్చిక బయళ్ళు, వీధులు, సముద్రానికి ఎదురుగా ఉన్న సెలబ్రేషన్ స్టేజీలను పూర్తిగా క్లీనింగ్ చేశారు. దీనికోసం మాన్యువల్ స్వీపర్లు, ఫోర్క్ లిఫ్ట్ లు, ట్రైలర్లు ఉపయోగిచారు. ఆయా ప్రాంతాల నుంచి గతం కంటే తక్కువ స్థాయిలో చెత్తను పోగయినట్లు మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పౌరుల హక్కుల పరిరక్షణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకం..!!
- రెసిలెన్స్ ఫ్లీట్‌లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- UK సినగోగ్ పై ఘోరమైన దాడి.. ఖండించిన బహ్రెయిన్..!!
- దుబాయ్‌లో అక్రమ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్..!!
- తప్పిపోయిన ఫాల్కన్ల ఓనర్లకు గుడ్ న్యూస్..!!
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!