రాధే శ్యామ్ కొత్త ట్రైలర్ కి ముహూర్తం ఖరారు
- February 28, 2022
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. కరోనా కారణంగా ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు మార్చి 11 న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.ఇక రిలీజ్ కి రెండు వారాలే సమయం ఉండడంతో మేకర్స్ ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు.ఇప్పటికే ఒకపక్క మెట్రో ట్రైన్స్ పై, థియేటర్ల వద్ద జ్యోతిషులతో కౌంటర్లు పెట్టించి డిఫరెంట్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇక మరోపక్క సోషల్ మీడియాలో సైతం సినిమా నుంచి రోజుకో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అంచనాలను పెంచేస్తున్నారు. ఇక తాజగా ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
గతంలో రిలీజ్ చేసిన ట్రైలర్ కి సైతం ప్రేక్షకులు ఫిదా అయిన సంగతి తెల్సిందే.ఇక ఈ రెండో ట్రైలర్ ని మార్చి 2, 2022న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా మరో కొత్త పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. విధికి, ప్రేమకు మధ్య భయంకర యుద్దానికి సాక్ష్యంగా ఈ సినిమా నిలవనునుంది. పీరియడ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.మరి ఈ చిత్రంతో ప్రభాస్ ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.
తాజా వార్తలు
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్‌లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- TCS ఉద్యోగుల తొలగింపు..