బస్ ప్రమాదం: ఇద్దరు మృతి

- February 28, 2022 , by Maagulf
బస్ ప్రమాదం: ఇద్దరు మృతి

మస్కట్: నిజ్వా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ఒమనీ విద్యార్థులు ఓ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అల్ దఖ్లియా గవర్నేటులోని విలాయత్ఆఫ్ సమైల్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మందికి గాయలయ్యాయి. అల్ హబౌబ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 7.30 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, విద్యార్థుల మృతి పట్ల నిజ్వా యూనివర్సిటీ ప్రగాఢ సంతాపం తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com