దోహా మెట్రో: గ్రీన్లైన్లో టన్నెలింగ్ వర్క్ పూర్తి
- March 31, 2016
ఖతార్ రైల్, గ్రీన్లైన్లో టన్నెలింగ్ పనులు పూర్తయినట్లు ప్రకటించింది. టన్నెల్ బోరింగ్ మెషీన్ ఎడ్యుకేషన్ సిటీ వద్ద ఈ పని పూర్తయ్యింది. ఇది ఆఖరి అండర్‌గ్రౌండ్ స్టేషన్. ఇటీవలే రెడ్ లైన్‌లోని నార్తరన్ సెక్షన్లో టన్నెల్ వర్క్ పూర్తికాగా, ఆ తర్వాత పది రోజుల్లోనే గ్రీన్లైన్లో టన్నెలింగ్ పనులు పూర్తవడం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రీన్‌లైన్ అండర్ గ్రౌండ్ స్టేషన్ పనులు 57 శాతం పూర్తి కాగా, ఓవరాల్ దోహా మెట్రో టన్నెలింగ్ ప్రక్రియ 87 శాతం పూర్తయ్యింది. 2014లో టన్నెలింగ్ వర్క్ ప్రారంభమైంది. ఆరు టన్నెల్ బోరింగ్ మెషీన్లను ఇందుకోసం వినియోగించారు. ఇందులో 22 కిలోమీటర్ల ఆపరేషన్ లైన్, 10 అండర్ గ్రౌండ్ స్టేషన్స్, ఒకటి మామూలు స్టేషన్ నిర్మిస్తున్నారు. గ్రీన్లైన్లో 19 కిలోమీటర్లు భూమి లోపల, 3 కిలోమీటర్ల భూమిపైన ఉంటుంది. 2019 నాలుగో క్వార్టర్లో దోహా మెట్రో ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. దోహా మెట్రో ఫస్ట్ ఫేస్ మరియు లుసైల్ ట్రామ్ 600,000 ప్యాసింజర్లు ప్రతిరోజూ ప్రయాణించే వీలుంటుందని ఖతార్ రైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 37 మెట్రో స్టేషన్లు, ఓ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్‌కి సగటు ప్రయాణ కాలం మూడు నిమిషాలుగా ఉంటుంది.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









