ఎయిర్‌ఇండియా సిబ్బంది కొత్త దుస్తులు!

- March 31, 2016 , by Maagulf
ఎయిర్‌ఇండియా సిబ్బంది కొత్త దుస్తులు!

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా తన విమాన సిబ్బంది డ్రస్‌కోడ్‌ను మార్చింది. మహిళలకు ఖాదీ సిల్క్‌ జాకెట్లు, చీరలు, పురుషులకు జోధ్‌పురి బంద్‌గలా కోట్లు, జాకెట్లు అన్నింటినీ ఖాదీ వస్త్రాలతోనే తయారు చేయించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న విషయం తెలిసిందే. మోదీతో పాటు ప్రయాణిస్తున్న విమాన సిబ్బంది కొత్త డ్రస్‌కోడ్‌తో దర్శనమిచ్చారు.
యువతకు ఖాదీ వస్త్రాలపై అవగాహన కల్పించేందుకు, ఖాదీ రంగాన్ని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశంగా ఎయిర్‌ ఇండియా తన సిబ్బంది డ్రస్‌కోడ్‌ను మార్చినట్లు సంస్థ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com