టర్కీలోని డైయైర్బేకిర్‌ నగరంలో బాంబు పేలుడు

- March 31, 2016 , by Maagulf
టర్కీలోని డైయైర్బేకిర్‌ నగరంలో బాంబు పేలుడు

టర్కీలోని డైయైర్బేకిర్‌ నగరంలో బాంబు గురువారం పేలుడు చోటు చేసుకొని నలుగురు పోలీసు అధికారులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ బస్‌ షెల్టర్‌ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. దీనిని ఎవరు చేపట్టారో తెలియదని అధికారులు చెబుతున్నారు.
టర్కీ సైన్యం ఈ ప్రాంతలోని కుర్దిష్‌ వర్కర్స్‌ పార్టీ రెబల్స్‌పై పోరాటం జరుపుతోంది. గత జులైలో ఇక్కడ ఉన్న కాల్పుల విరమణ ఒప్పదం రద్దైపోయింది. అప్పటి నుంచి హింస ప్రారంభమైంది. ప్రస్తుతం పేల్చిన బాంబు కూడా ఓ సాయుధ పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొన్నదేనని భావిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com