కతార్ స్టేడియం నిర్మాణంలో వెట్టిచాకిరీ

- March 31, 2016 , by Maagulf
కతార్ స్టేడియం నిర్మాణంలో వెట్టిచాకిరీ

ఫిఫా 2022లో నిర్వహించే ప్రపంచకప్‌ కోసం సిద్ధమవుతున్న ప్రధాన స్టేడియం పనుల్లో ఉద్యోగుల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ప్రముఖ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నెషనల్‌ ఆరోపించింది. ఇక్కడ పనిచేసే వారికి అత్యంత నాసిరకపు వసతి కల్పిస్తూ వాటిల్లోనే ఉండాలని బలవంతం చేస్తున్నారని.. వారి వద్ద నుంచి భారీగా రిక్రూట్‌మెంట్‌ ఫీజ్‌ వసూలు చేశారని.. దీంతోపాటు వేతనాలను నిలిపివేసి.. పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకొని పని చేయిస్తున్నారని ఆరోపించింది. ఫిఫా ఈ వ్యవహారాన్ని పసిగట్టడంలో పూర్తిగా విఫలమైందని కూడా తన నివేదికలో అమ్నెస్టీ ఆరోపించింది.

మానవహక్కుల ఉల్లంఘనలతో నిర్మించే ప్రాంగణాల్లో టోర్ని నిర్వహించవద్దని అమ్నెస్టీ కోరింది. దీనిపై కతార్‌ ప్రభుత్వం స్పందిస్తూ ఈ ఆరోపణలపై విచారణ నిర్వహిస్తామని పేర్కొంది. వలస కూలీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. దీనిపై ఫిఫా గవర్నెంగ్‌ బాడీ కూడా స్పందించి కొన్ని కొలమానాలను ఇప్పటికే నిర్దేశించామని.. ప్రస్తుతం వలస కార్మికుల జీవన పరిస్థితి మెరుగుపడిందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com