'ఎటాక్' మూవీ రివ్యూ....

- April 01, 2016 , by Maagulf
'ఎటాక్' మూవీ రివ్యూ....

టైటిల్ : ఎటాక్జానర్ : క్రైమ్ థ్రిల్లర్తారాగణం : మంచు మనోజ్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్, సురభిదర్శకత్వం : రామ్ గోపాల్ వర్మనిర్మాత : సి.కళ్యాణ్చాలా రోజులుగా టాలీవుడ్ లో తన స్ధాయికి తగ్గ సినిమాలు తీయటంలో తడబడుతున్న రామ్ గోపాల్ వర్మ, ఎటాక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇటీవల కన్నడలో తెరకెక్కించిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చినట్టే కనిపించిన వర్మ, ఎటాక్ సినిమాతో తెలుగులోనూ అదే ఫామ్ చూపించాలని భావించాడు. వర్మకు తనకు బాగా పట్టున్న క్రైం థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఎటాక్ టాలీవుడ్ లో వర్మను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా.
.? తొలిసారిగా పూర్తి సీరియస్ క్యారెక్టర్ లో నటించిన మనోజ్, ఆ పాత్రలో ఎంత వరకు మెప్పించాడు..?కథ : ఒకప్పుడు హైదరాబాద్ లో దందాలు చేస్తూ పెద్ద రౌడీగా పేరు తెచ్చుకున్న గురురాజ్(ప్రకాష్ రాజ్), తన కుటుంబం కోసం దందాలు వదిలి పెట్టి చార్మినార్ గ్రూప్స్ పేరుతో బిజినెస్ చేసుకుంటూ బతుకుతుంటాడు. అయితే ఒకసారి రౌడీయిజంలో అడుగుపెట్టిన తరువాత వెనక్కి వెళ్లలేమన్న నిజం తెలిసిన గురు, తన జాగ్రత్తలో తాను ఉంటాడు. కానీ అనుకోకుండా ఓ రోజు గుడికి వెళ్లిన గురురాజ్ మీద ఎటాక్ జరుగుతుంది. ఆ ఎటాక్ లో గురురాజ్ చనిపోతాడు. నరసింహులు అనే వ్యక్తితో ఉన్న ల్యాండ్ డీలింగ్ కారణంగానే గురురాజ్ ను హత్య చేసి ఉంటారని అంతా భావిస్తారు. అదే అనుమానంతో గురురాజ్ పెద్ద కొడుకు కాళీ(జగపతిబాబు) నరసింహులు కోసం వెతుకుతుంటాడు.గురురాజ్ రెండో కొడుకు గోపి(వడ్డే నవీన్) మాత్రం ఈ గొడవలు వద్దని ఇప్పటికైనా ఆ ల్యాండ్ వదిలేసి అందరం ప్రశాతంగా ఉందాం అంటూ అన్న కాళీని వారిస్తుంటాడు. ఈ విషయాలేవి పెద్దగా తెలియని గురురాజ్ చిన్న కొడుకు రాధ(మంచు మనోజ్) బిజినెస్ లు పక్కన పెట్టి అన్నకు తోడుగా నిలబడతాడు. అదే సమయంలో ఒంటరిగా నరసింహులు కోసం వెళ్లిన కాళీ మీద ఎటాక్ జరుగుతుంది. పారిపోవాలని ప్రయత్నించిన కాళీని నడిరోడ్డు మీద నరికి చంపేస్తారు. దీంతో రాధను ప్రేమించిన వల్లి(సురభి), రాధను ఈ గొడవల్లోకి వెల్లొదని చెపుతోంది. కానీ రాధ మాత్రం తన తండ్రి, అన్నను చంపిన వారి మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టిన రాధ తన తండ్రిని, అన్నను చంపిన వారిని ఎలా కనిపెట్టాడు..? వారి మీద ఎలా పగతీర్చుకున్నాడు..? అన్నదే మిగతా కథ.నటీనటులు : తొలిసారిగా సీరియస్ క్యారెక్టర్ లో కనిపించిన మంచు మనోజ్ బాగానే ఆకట్టుకున్నాడు. తన రెగ్యులర్ ఎనర్జీకి భిన్నంగా సెటిల్డ్ క్యారెక్టర్ తో మెప్పించాడు. ఎమోషన్స్ పలికించటంలో మంచి పరిణతి కనిపించాడు. ఇక ప్రకాష్ రాజ్, జగపతి బాబుల పాత్రలు చిన్నవే అయినా ఉన్నంతలో తమ మార్క్ చూపించారు. లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి తెర మీద కనిపించిన వడ్డే నవీన్ పరవాలేదనిపించాడు. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ లోనే కనిపించిన పూనమ్ కౌర్ తొలిసారిగా ఓ బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించింది. విలన్ గర్ల్ ఫ్రెండ్ గా పూనమ్ నటన కొత్తగా అనిపిస్తుంది. హీరోయిన్ గా నటించిన సురభి పాత్ర చిన్నదే అయిన ఉన్నంతలో పరవాలేదనిపించింది.సాంకేతిక నిపుణులు : పగ, ప్రతీకారాలు అన్న చిన్న లైన్ ను రెండున్నర గంటల సినిమాగా మలచిన వర్మ, మరోసారి ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. తన గత సినిమాల్లో కనిపించిన కెమెరా వర్క్, అదే తరహా నేపథ్య సంగీతం, దాదాపు అవే పాత్రలను మరోసారి తెర మీద చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ సారి కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న నటులను ఎంపిక చేసుకొని సినిమా మీద ఆసక్తి కలిగించిన వర్మ, కథ కథనాల్లో మాత్రం ఎలాంటి కొత్తదనం చూపించలేదు. ఎడిటింగ్ కూడా వర్మ సినిమా స్థాయిలో లేదు. ప్రతీసారి చనిపోయిన ప్రకాష్ రాజ్ మాట్లాడిన సీన్స్ వచ్చి సినిమా ఫ్లోను ఇబ్బంది పెడతాయి. ఇతర విభాగాలు పనితీరు కూడా ఆశించిన స్ధాయిలో లేదు.ప్లస్ పాయింట్స్ : ప్రధాన పాత్రదారులుమైనస్ పాయింట్స్ : రొటీన్ టేకింగ్ డైలాగ్స్ఓవరాల్ గా ఎటాక్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మరో రొటీన్ క్రైం థ్రిల్లర్- సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com