ఆసియాన్ హ్యూమన్ ట్రాఫికర్లపై మార్చి 29న తీర్పు

- March 16, 2022 , by Maagulf
ఆసియాన్ హ్యూమన్ ట్రాఫికర్లపై మార్చి 29న తీర్పు

బహ్రెయిన్: ఇద్దరు ఆసియాకు చెందిన మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన ఇద్దరు ఆసియా హ్యూమన్ ట్రాఫికర్లపై మార్చి 29న తీర్పు చెప్పనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితులు బాధితులను కిడ్నాప్ చేసి, అపరిచితులతో లైంగిక సంబంధాల కోసం బలవంతం చేసేవారు. బాధితుల్లో ఒకరు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ కు వచ్చిన సమయంలో తప్పించుకోవడంలో భాగంగా ఆమె భవనం నుండి కిందకు దూకింది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు కావడంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీంతో ముఠా గుట్టు రట్టు అయింది. బాధితురాలు చెప్పిన వివరాలతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను ఒక సంవత్సరం క్రితం BD120 నెలవారీ కోసం గృహ సేవకునిగా పని చేయడానికి బహ్రెయిన్‌కి వచ్చానని, తనకు సోషల్ మీడియాలో ఒక ఆసియా మహిళతో పరిచయం ఏర్పడిందని, ఆమె నాకు స్థానిక హోటల్ లేదా ఆసుపత్రిలో క్లీనర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిందని, దీంతో వారిన మాటలను నమ్మి తన స్పాన్సర్ నుండి పారిపోయి.. వారి వద్దకు వెళ్లినట్టు బాధితురాలు ప్రాసిక్యూటర్‌లకు వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com