బస్సుల్లో డ్రైవర్‌ పై అరిస్తే 500 దిర్హామ్‌ల ఫైన్

- March 17, 2022 , by Maagulf
బస్సుల్లో డ్రైవర్‌ పై అరిస్తే 500 దిర్హామ్‌ల ఫైన్

యూఏఈ: పబ్లిక్ బస్సులో అందరూ నాగరిక ప్రవర్తన కలిగి ఉండాలని అబుదాబిలోని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు కోరారు. బుధవారం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్ (ITC)  పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగదారులు తరచుగా చేసే ఉల్లంఘనలు, ఫైన్లను తెలిపే వీడియోను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది. బస్సులలో చోటుచేసుకునే ఉల్లంఘనలకు Dh100 నుండి Dh500 వరకు ఫైన్లు విధించనున్నట్లు తెలిపింది. తోటి ప్రయాణీకులను అగౌరపరిస్తే Dh500 జరిమానా, డ్రైవర్‌పై అరవడం లేదా అతని దృష్టి మరల్చడం లాంటి చర్యలకు పాల్పడితే Dh500 ఫైన్ విధిస్తారు. తమ రవాణా కార్డులను ఇతరులకు విక్రయిస్తే Dh500 జరిమానా, బస్సులో తినడం, తాగడం,  ధూమపానాలకు పాల్పడితే 200 దిర్హామ్‌ల జరిమానా విధించబడుతుంది. బస్సు టికెట్ తీసుకోని వారికి 200 దిర్హామ్‌లు జరిమానా విధించనున్నట్లు ITC పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com