దుల్కర్‌ సల్మాన్‌ పై బ్యాన్ వేటు..ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ కారణంగానే!

- March 17, 2022 , by Maagulf
దుల్కర్‌ సల్మాన్‌ పై బ్యాన్ వేటు..ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ కారణంగానే!


స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌.. కు మలయాళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఆయన సినిమాలు విడుదలైతే.. తెలుగు ప్రేక్షకులు కూడా… ఎగబడి చూస్తారు.

కేవలం మలయాళం చిత్ర పరిశ్రమకు మాత్రమే.. పరిమితం కాకుండా మల్టీ లాంగ్వేజ్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు దుల్కర్‌ సల్మాన్‌. అయితే.. వరుస హిట్లతో… దూసుకెళుతున్న దుల్కర్‌ సల్మాన్‌ కు కేరళ థియేటర్ల ఓనర్లు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చారు.

దుల్కర్‌ సల్మాన్‌.. నటించిన సినిమమాలన్ని.. బాయ్‌ కాట్‌ చేయాలని ది ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ యునైటెడ్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కేరళ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం ఏమిటంటే.. తన తాజా సినిమా సెల్యూట్‌..ను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ అయిన సినీలివ్‌ లో విడుదల చేయాలని దుల్కర్‌ సల్మాన్‌.. నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విడుదల చేయకుండా ఓటీటీ లో రిలీజ్‌ చేయడంపై మగ్గుమన్న.. కేరళ థియేటర్ల యాజమానులు… ఆయన సినిమాలు బ్యాన్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com