రష్యా పద్దతి సరికాదంటూ ఓటేసిన భారత న్యాయమూర్తి..మరి రష్యా ఏమంది?
- March 17, 2022ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై తీర్పు వెలువరించిన అంతర్జాతీయ న్యాయస్థానం ధర్మాసనంలో భారత న్యాయమూర్తి సైతం ఉన్నారు. ఆయన రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. మరోవైపు.. చైనా, రష్యా న్యాయమూర్తులు ఉక్రెయిన్ పిటిషన్ను వ్యతిరేకించారు. వివరాల్లోకి వెళితే...
ఉక్రెయిన్పై దురాక్రమణ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో భారతీయ జడ్జి సైతం రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. ఉక్రెయిన్పై దండయాత్రకు వ్యతిరేకంగా ఐసీజే తీర్పు చెప్పగా.. భారత్ నుంచి న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారీ అందులో భాగమయ్యారు. సైనిక చర్యను నిలిపివేయాలని ఉక్రెయిన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన 15 మంది న్యాయమూర్తుల్లో.. 13మంది రష్యాకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇద్దరు పిటిషన్ను వ్యతిరేకించారు. ఉక్రెయిన్ ఫిర్యాదును తోసిపుచ్చిన వారిలో రష్యా న్యాయమూర్తి, ఐసీజే ఉపాధ్యక్షుడు కిరిల్ గెవోర్జియన్, చైనా న్యాయమూర్తి షూ హాన్కిన్ ఉన్నారు.
తక్షణమే రష్యా దళాలు తమ దాడులను నిలిపివేయాలని ఐసీజే బుధవారం ఆదేశాలిచ్చింది. 1948 జెనోసైడ్ కన్వెన్షన్‌ను రష్యా ఉల్లంఘించిందని పేర్కొంది. ఫిబ్రవరి 24న రష్యా సమాఖ్య ప్రారంభించిన సైనిక చర్యను నిలిపివేయాలంటూ తీర్పిచ్చింది. ఈ తీర్పును అమెరికా స్వాగతించింది. రష్యా వెంటనే సైనిక చర్య నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఐసేజీ తీర్పు స్పష్టంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు.
అయితే ఈ తీర్పునకు పుతిన్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా లేదా అన్నది అనుమానమే. ఈ విచారణకు రష్యా హాజరు కాలేదు. తర్వాత లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి రాదని వాదించింది. దీన్ని రష్యా అమలుచేయకపోతే.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి అంతర్జాతీయ న్యాయస్థానం నివేదిస్తుంది. మండలిలో రష్యాకు వీటో అధికారం ఉన్న నేపథ్యంలో తీర్పు అమలు ప్రశ్నార్థకమేనని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
భారత్తో అమెరికా చర్చలు..
మరోవైపు, భారత్లోని నాయకులు రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా నిలబడేలా అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్లు శ్వేతసౌధ అధికార ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. అధికారులతో ఈ మేరకు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. జాతీయ భద్రతా బృందాలు వివిధ మార్గాల్లో సంప్రదింపులు కొనసాగిస్తున్నారని వివరించారు.
తాజా వార్తలు
- BNI ఇండియా డెలిగేషన్తో బిజినెస్ కాంక్లేవ్.. 46 మంది హాజరు..!!
- కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు కార్యాచరణ..ఈవీలకు ప్రోత్సాహం..!!
- యూఏఈలో అమెరికా అపాంట్మెంట్స్..డిలే, రిస్క్ ను ఎలా తగ్గించాలంటే..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..!!
- ఆన్ లైన్ లో అటెస్టేషన్ సేవలు ప్రారంభం..ఇక 24గంటలు క్లియరెన్స్ సర్టిఫికేట్..!!
- 120 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ తొలగింపు.. 14వేల ఛానెల్స్ మూసివేత..!!
- టీమిండియా ఆల్రౌండ్ షో….తొలి టీ20లో బంగ్లా చిత్తు
- TANA వైద్యశిబిరం విజయవంతం-550 మందికి చికిత్స
- Systematic Withdrawal Plan (SWP) ప్లాన్ లాభాల గురించి తెలుసా..?
- చెన్నై ఎయిర్ షో లో విషాదం