చీజీ బ్రెడ్ రెసిపీ
- March 17, 2022
కావలసిన పదార్ధాలు:
టొమాటోలు - రెండు
వెల్లుల్లి రెబ్బలు - ఆరు
పసుపు - పావు టీ స్పూన్
కారం - అర టీ స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
పనీర్ ముక్కలు - పదహారు,
గ్రేటెడ్ చీజ్ - మూడు టేబుల్ స్పూన్స్
బట్టర్ - 1 టేబుల్ స్పూన్
బ్రెడ్ స్లైసెస్ - నాలుగు
నూనె : 1 టీ స్పూన్
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా గ్రైండర్ లో టొమాటోలు, వెల్లుల్లి రెబ్బలు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయిలో ఈ మిశ్రమాన్ని పోసి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. అప్పుడు పసుపు, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి ఇంకో 2 నిమిషాలు వేయించాక, పన్నీర్ ముక్కలు వేసి గ్రేవీ చిక్కపడేంతవరకు తిప్పి, స్టవ్ ఆపి చల్లార పెట్టుకోవాలి.
స్టవ్ మీద పెనం పెట్టుకుని, రెండు బ్రెడ్ స్లైసెస్ కింద వైపు బట్టర్ రాసి, పైన గ్రేటెడ్ చీజ్ వేసి, పన్నీర్ గ్రేవీ ని బ్రెడ్ మీద స్ప్రేడ్ చేసి, వేరే లిడ్ తో కవర్ చేసి, ఒక నిమిషం ఆగాక తీసి. పైన చిల్లి ఫ్లెక్స్ తో గార్నిష్ చేసి, వేడి వేడి గా సెర్వ్ చెయ్యాలి.
ఇది 10 నిమిషాలలో తయారు అయ్యే హెల్తీ రెసిపి నే కాకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేది.
తాజా వార్తలు
- 5 అప్కమింగ్ వాట్సాప్ ఫీచర్లు
- నేటి నుండి ఏపీ రాష్ట్ర స్ధాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్
- ప్రపంచ ఆర్థిక ఔట్ లుక్ జనవరి అప్ డేట్ రిలీజ్ చేసిన IMF
- ఖతార్ లో 100% పైగా పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- ఒమన్లో చెక్-బౌన్స్ కేసులదే అగ్రస్థానం: 2022లో 13 హత్యలు
- యూఏఈ రెసిడెన్సీ వీసాలు: మీరు తెలుసుకోవలసిన 7 ముఖ్యమైన మార్పులు
- ముసందమ్లో భూకంపం
- ఫిబ్రవరి 2023 పెట్రోలు, డీజిల్ ధరలు
- ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విశాఖపట్నం ... బాంబు పేల్చిన సీఎం జగన్..!
- దుబాయ్ టూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటో వైరల్!