కరోనా నాల్గో వేవ్‌ ముప్పు.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి : భారత ప్రభుత్వం

- March 17, 2022 , by Maagulf
కరోనా నాల్గో వేవ్‌ ముప్పు.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి : భారత ప్రభుత్వం

భారతదేశంలో కరోనా కేసులు తగ్గిపోయాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ రూపంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.

ఒమిక్రాన్ వేరియంట్‌తో కరోనా ఖతమైందిలే అనుకున్న తరుణంలో మరో కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దాంతో చైనాలోని పలు నగరాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది. భారత్‌లో మళ్లీ కరోనా విజృంభించే పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో కరోనా నాల్గో వేవ్ ముప్పు పొంచి ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులను చూస్తే అదే పరిస్థితి రాబోతుందనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. స్కూళ్లు తిరిగి తెరవడం, ఆఫీసులకు వెళ్లడం, మాస్క్‌ నిబంధనలను సడలించడం వంటి కారణాలు కూడా అయి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనంతో రద్దీగా ప్రాంతాలు కనిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో కరోనా మరింత విజృంభించేందుకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పక్కదేశమైన చైనాలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో కరోనా కేసులకు సంబంధించి కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కేసుల పెరుగుదల, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్షన్ పెరుగుదల వంటి మూడు అంశాలపై దృష్టి సారించాలని మాండవీయ అధికారులను ఆదేశించారు. ఈ మూడింటిపై నిఘా పెట్టాలని కేంద్ర మంత్రి మాండవీయ అధికారులను సూచించారు. కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతున్న క్రమంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచనలు చేశారు. కరోనా నాల్గో వేవ్ ముప్పును ముందుగానే కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com