భారత్ లో 12-18 ఏళ్ల వారికి అత్యవసర వినియోగనిమిత్తం నోవావాక్స్ కు డీజీసీఐ అనుమతి
- March 23, 2022
భారత్ లో 12-18 మధ్య వయసు వారికి అత్యవసర వినియోగ నిమిత్తం తాము అభివృద్ధి చేసిన నోవావాక్స్ కరోనా టీకాకు అనుమతి లభించిందని సీరం ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. ఈమేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించినట్లు సంస్థ పేర్కొంది. భారత్ లో 12-18 ఏళ్ల వయసున్న వారికి కరోనా టీకా పంపిణీ చేయాలంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఈప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. NVX-CoV2373 అని కూడా పిలువబడే ఈ వ్యాక్సిన్ను సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) భారత్ లో తయారు చేసి ‘కోవోవాక్స్’ బ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. ఇక 12-18 వయసు వారికీ నోవావాక్స్ కోవిడ్ టీకా అత్యవసర వినియోగంలోకి రావడంతో..ఇప్పటికే ఉన్న మూడు టీకాలు ప్రత్యామ్న్యాయంగా నిలిచింది. బయోలాజికల్ ఈ అభివృద్ధి చేసిన Corbevax, Zydus Cadila అభివృద్ధి చేసిన ZyCoV-D మరియు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాలు ఇప్పటికే అనుమతి పొందగా కౌమారదశ వారికి ఆయా టీకాలు అందిస్తున్నారు.
ప్రోటీన్ ఆధారిత టీకాగా చెప్పబడే ఈ వ్యాక్సిన్ కోవిడ్-19కి వ్యతిరేకంగా 80 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు సీరం సంస్థ తెలిపింది. గత నెలలో నిర్వహించిన చివరి దశ ట్రయల్స్ విజవంతంగా జరిగాయని..పిల్లల్లోనూ ఈ వ్యాక్సిన్ రోగనిరోధక శక్తిని ప్రతిస్పందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. భారత్ లో 12 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో యాక్టివ్ ఇమ్యునైజేషన్ కోసం Covovax Vaccine అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవచ్చని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతిపాదించిన అత్యవసర వినియోగ జాబితా (EUL)లో Covovax కూడా ఒకటిగా ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







