ఫోన్ స్కామ్.. Dh140,000 కోల్పోయిన రెసిడెండ్
- March 26, 2022
యూఏఈ: ఫోన్ స్కామ్‌కు గురైన ఒక ప్రవాసుడు 140,000 దిర్హామ్‌లను కోల్పోయాడు. కానీ ఒక నెలలోనే ఆ మొత్తాన్ని అబుదాబి పోలీసులు రికవరీ చేశారు. ఫోన్ స్కామ్‌ల గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సంఘటనను బాధితుడు వివరించిన వీడియోను తాజాగా షేర్ చేశారు. మోసగాళ్లు మొదట తన ఎమిరేట్స్ ఐడీని కోరుతూ ఇమెయిల్ పంపారని ఆ వ్యక్తి చెప్పాడు. అప్పుడు, పోలీసు అధికారులుగా నటిస్తూ.. వారు అతనికి ఫోన్ చేసి, అతని వివరాలను ధృవీకరించమని అడిగారు. తాను వారికి తన వివరాలన్నింటినీ అందించాను. తరువాత, నా బ్యాంక్ ఖాతా నుండి Dh 140,000 కంటే ఎక్కువ మొత్తం తన అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చిందని వీడియోలో బాధితుడు వివరించాడు. తాను మోసపోయానని గ్రహించిన వెంటనే.. తన బ్యాంక్ ఖాతాను మూసివేయడానికి, కార్డులను బ్లాక్ చేయడానికి తన బ్యాంక్‌కు కాల్ చేసానని చెప్పాడు. అనంతరం పోలీసు డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేశానన్నారు. దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని పోలీసులు చెప్పారని ఆ వ్యక్తి చెప్పాడు. నెల రోజుల్లోపే తనకు పోలీసు శాఖ నుంచి ఫోన్ వచ్చిందని బాధితుడు చెప్పాడు. డెబిట్ అయిన మొత్తం రికవరీ అయిందని, రెండు మూడు రోజుల్లో తన ఖాతాలో చేరుతుందని పోలీసు అధికారి తెలిపారని బాధితుడు వివరించాడు. తనకు న్యాయం చేసిన అబుదాబి పోలీసులకు, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







