పవిత్ర రమదాన్ మాసం ముందు 659 మందికి క్షమాభిక్ష
- March 28, 2022
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం ముందు యూఏఈ ప్రధానమంత్రి మరియు ఉపాధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్,దుబాయ్ లోని వివిధ కారాగారాలలో, సంస్కరణ కేంద్రాలలో జైలు శిక్షను అనుభవిస్తున్న 659 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు.
షేక్ మొహమ్మద్, బందీల కుటుంబాలలో ఆనందం నింపడానికి ఇచ్చిన ఆజ్ఞలను వెంటనే అమలుచేయడానికి అవసరమైన బహిరంగ న్యాయవిచారణ ప్రక్రియ, పోలీసు శాఖ వారి సహకరంతో వెంటనే ప్రారంభించబడినదని,దుబాయ్ అటర్నీ జనరల్ అల్ హుమైదాన్ తెలిపారు.షేక్ మొహమ్మద్ దయాధర్మ దృష్టికి కృతజ్ఞతలు తెలియచేశారు.అంతేకాకుండా, విడుదలైన ఖైదీలు, తమ మిగిలిన జీవితాన్ని, మతపరమైన, నైతిక పరమైన నియమాలకు ఒడంబాడి జీవించాలని పిలుపునిచ్చారు.
దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, దుబాయ్ పోలీసుల సహకారంతో షేక్ మహ్మద్ ఆదేశాలను అమలు చేయడానికి చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించినట్లు అల్-హుమైదాన్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష